బీజేపీ.. పద‌వులు అమ్ముకునే ఓ చిల్ల‌ర పార్టీ : కేటీఆర్‌

-

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిన్న హైదరాబాద్‌లో పర్యటించి.. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమిత్‌ షా టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంత అవినీతి ప్ర‌భుత్వాన్ని దేశంలోనే చూడ‌లేద‌ని అమిత్ షా వ్యాఖ్యానించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు కేటీఆర్. సీఎం పీఠం కోసం కేంద్ర అధిష్టానం రూ. 2500 కోట్లు అడిగిన‌ట్లు క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన మాట ఇది అని స్ప‌ష్టం చేశారు.

ఈ ఎమ్మెల్యే ఇప్ప‌టి వ‌ర‌కు స‌స్పెండ్ కాలేదు.. చ‌ర్య‌లు తీసుకోలేదు.. బీజేపీ అధిష్టానం ఖండించ‌లేద కేటీఆర్ అన్నారు. ప‌ద‌వులు అమ్ముకునే ఓ చిల్ల‌ర పార్టీ మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్. హిందూ మ‌ఠాల వ‌ద్ద 30 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌నిదే నిధులు రావ‌ని ఓ పీఠాధిప‌తి చెప్పడని, క‌ర్ణాట‌క‌లో కాంట్రాక్ట‌ర్ల‌ను కూడా వేధిస్తున్నారు. 40 శాతం క‌మీష‌న్ అడుగుతున్నారు. మంత్రి ఈశ్వ‌ర‌ప్ప వేధింపులు త‌ట్టుకోలేక ఓ కాంట్రాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యాన్ని మ‌నం గుర్తించాలి అని ఆయన అన్నారు. అదే క‌ర్ణాట‌క‌లో 40 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌క‌పోతే టూరిజం మంత్రి ఓ ప్రాజెక్టును ఆపేశారు. ఇప్పుడు చెప్పండి ఎవ‌రిదీ అవినీతి ప్ర‌భుత్వ‌మ‌ని నిల‌దీశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version