గులాబీలు ఎక్కువగా కొత్త కొమ్మలకు కాస్తాయి..అందుకే కొమ్మ కత్తిరింపు చెయ్యాలి..మొక్క సైజును అదుపులో ఉంచి మంచి ఆకారం సంతరించుకొని మొక్కకు అవసరమైన గాలి వెలుతురు ప్రసరించడానికి కత్తిరింపులు చేయాలి. సంవత్సరానికి ఒకసారి అనగా వర్ష కాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ – నవంబర్ మాసలలో కొమ్మ కత్తిరింపులు అనుకూలం.హైబ్రిడ్ టి రకాలు మనం కోరుకునే పూత సమయానికి 45 రోజుల ముందుగానే పోర్లిబండ రకాలను 42 రోజుల ముందు కత్తిరించాలి. చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలు అన్నిటిని కత్తిరించాలి.
తెగులు లేదా పురుగులు ఆశించిన కొమ్మలను కత్తిరించాలి.ఆరోగ్యంగా, బలంగా ఉన్న కొమ్మలపై తగినంత వెలుపల ఉన్న మొగ్గకు సుమారు 5 మీ. మీ పైన పదునైనా కత్తెరతో కత్తిరించాలి.గులాబీ పొద మధ్య భాగం ఖాళీగా ఉండేలా కత్తిరింపులు చేస్తే అన్ని కొమ్మలకు గాలి, వెలుతురు,ప్రసరించి పెద్ద సైజు పూలు ఏర్పడతాయి.హైబ్రిడ్ రకాలలో పసుపు పచ్చని మిశ్రమ రంగు గల రకాలను సగము లేదా భాగాల కొమ్మలను కత్తిరించాలి. పోర్లి బండ మొక్కలను ¼ వంతు మొక్కను మాత్రమే కత్తిరించాలి.కత్తిరించిన అన్ని భాగాలకు విధిగా బోర్డు పేస్ట్ రాయాలి.దీని వలన శీలింద్ర బీజలకు ప్రవేశం ఉండదు..
ఈ గులాబీల లో పెంకు పురుగులు ఎక్కువగా ఉంటాయి..నివారణకు మలాథియాన్ 5% పోడిని 15 కిలోలు సాయంత్రం సమయంలో వేయాలి.. పేను ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఆకుల కొనలు మరియు మొగ్గ నల్లగా మారుతాయి. నివారణకు డైమీథోయేట్ 2మీ. లి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ. లీ లీటర్ నీటికి పిచికారీ చేయాలి..
ఎర్రనల్లి వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది..దీనివలన మొత్తం ఆకులు రాలిపోతాయి.నివారణకు 3 గ్రా. నీటిలో గంధకం లేదా డైకోఫాల్ 5 మీ. లీ.లీటర్ నీటికి పిచికారీ చేయాలి..ఎండు రోగం.. మొక్క పై భాగం నుండి కింది వరకు ఎండి పోతుంది.ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుండి మొదలవుతుంది.
తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుకు మారతాయి.కాండం వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు ప్రూనింగ్ కొమ్మలకు వెంటనే రాగు ధాతు సంబంధమైన మందును పేస్ట్ ల చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూయాలి. లేదా పచ్చి పేడ మరియు మట్టి కలిపిన పేస్ట్ పూసి కూడా ఈ తెగులును నివారించవచ్చు..బూడిద తెగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది..వ్యవసాయ నిపునుల సలహా మేరకు తగు చర్యలు తీసుకోవడం మేలు..