పెళ్ళిలో మేకప్ విషయంలో సాధారణంగా అమ్మాయిలు చేసే పొరపాట్లు

-

పెళ్లనగానే అమ్మాయైనా, అబ్బాయైనా పూర్తిగా తమ లుక్కును మార్చేసుకోవాలని అనుకుంటారు. దానికోసం డైట్లు ఫాలో అవుతుంటారు. పెళ్లిలో మరింత బాగా కనిపించటానికి మేకప్ వగైరా వేస్తుంటారు. సరిగ్గా మేకప్ విషయంలోనే అమ్మాయిలు చాలా పొరపాట్లు చేస్తుంటారు.
ఆ పొరపాట్ల వల్ల సాధారణంగా కనిపించినప్పటికన్నా పెళ్లిలో ఇంకా అందవిహీనంగా కనిపిస్తారు.

మీరు కూడా ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతుంటే.. సాధారణంగా పెళ్లిలో చేసే పొరపాట్ల గురించి తెలుసుకోవడం మంచిది.

ఓవర్ మేకప్:

దాదాపు ప్రతీ పది పెళ్లిళ్లలో 9మంది పెళ్లికూతుర్లు ఓవర్ గా రెడీ అవుతారు. దీనికి కారణం మేకప్ అంటే అర్థం తెలియకపోవడమే. మేకప్ అంటే పౌడర్లన్నీ రుద్దేసి చిత్రచిత్రంగా కనిపించడం కాదు. మీ మొహంలో కొన్ని భాగాలను ఎలివేట్ చేయడం ద్వారా ఇంకా అందంగా కనిపించేలా చేయడమే మేకప్. ఈ విషయం తెలియక అనవసరంగా ఏదేదో చేస్తుంటారు.

చర్మాన్ని ప్రిపేర్ చేయకపోవడం:

మేకప్ కి మీ చర్మాన్ని అలవాటు చేయాలి. లేదంటే మేకప్ లో వాడే సాధనాలను మీ చర్మం తట్టుకోలేక.. చర్మం ఎర్రగా మారడం జరుగుతుంది. అందుకే కొన్ని రోజుల ముందు మీ ముఖానికి ఎలాంటి మేకప్ సాధనాలు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయో చూసుకోవాలి. లేదంటే మేకప్ వేసుకున్న తర్వాత ఇరిటేషన్ తో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

మీ బాడీకి సూట్ కానీ డ్రెస్ వేసుకోవడం:

మేకప్ అంటే కేవలం ముఖానికి మాత్రమే అని చాలామంది అనుకుంటారు. వేసుకుని డ్రెస్ కూడా మేకప్ లో భాగమే అని చాలామందికి తెలియదు. ఒక్కొక్కరి శరీరానికి ఒక్కొక్క రకమైన డ్రెస్ సూట్ అవుతుంది. మీకు ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుందో తెలుసుకుని ట్రయల్ చేసి ఆ విధంగానే తయారవ్వండి. మార్కెట్లో అందరూ కొత్తగా ట్రై చేస్తున్నారని గుడ్డిగా అటువైపు వెళ్ళకండి.

వేసుకునే చెప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం:

పెళ్లిలో గ్రూప్ ఫోటోలు దిగేటప్పుడు చాలాసేపు నిల్చోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు వేసుకునే చెప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హై హీల్స్ వంటివి వేసుకున్నారంటే అయిపోయినట్టే. కాబట్టి చెప్పులు తీసుకునేటప్పుడు అన్నీ ఆలోచించి తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version