42 మంది విద్యార్థుల్ని రేవంత్ సర్కార్ పొట్టన పెట్టుకుంది : ఎమ్మెల్సీ కవిత

-

అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను మరియు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలి. ఫుడ్ పాయిజన్ , కరెంట్ షాక్ తో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిoచి వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆసరాగా వుండాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని పరామర్శించడం బాధాకరంగ వుంది.

రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగిస్తుంది. అన్ని సంక్షేమ శాఖలను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విద్యార్థుల మరణాలపై దృష్టి సారించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన వసతులు కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయి. నారాయణపేట్ పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపిన మరుసటి రోజే మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడం దురదృష్టకరం. 42 మంది విద్యార్థులు మృత్యు వాత పడితే ఎందుకు ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పాఠశాలలో చేరితే ఈ ప్రభుత్వంలో ప్రాణాలు కోల్పోవడానికి చేరుతున్నారు అని కవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version