నాలుగు అక్షరాలు ఉంటాయి..పొరపాటున అది వచ్చిందంటే పెళ్లి ప్రశ్నార్థకమే ఇగ..అదేనండి బట్టతల. పురుషులకు పెద్దసమస్య ఈ బట్టతల. ఈ మధ్యనే తెలుగులో ఓ సినిమా కూడా వచ్చింది కదా. ఈ సమస్యతో బాధపడేవారు మళ్లీ జుట్టు మొలిపించేందుకు ఎన్నో చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైడ్ ఎఫెక్ట్స్ కి బలవుతారు. ఏ సైడ్ ఎఫెక్ట్సే లేకుండా ఈ సమస్యకు చికిత్స అందుబాటులోకి రాలేదు..కాబట్టి అవేంటి ప్రజలు తెలుసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొందరికి వంశపారంపర్యంగా బట్టతల వస్తే మరికొందరికి వయసు రీత్యా బట్టతల వస్తుంది. మగవారిలో జుట్టు రాలటాన్ని ఆండ్రోజెనిటిక్ అలొపేషియా అంటారు. బట్టతల కేవలం పురుషుల్లోనే వచ్చే సమస్యకాదు..ఇది స్త్రీలకు కూడా వస్తుంది. పురుషుల్లో ఇది చాలా సహజం. 50 ఏళ్లు దాటిందంటే దాదాపు పురుషులందరికీ పల్చని తల కనిపిస్తుంది. దీనికి కొంతమేరకు హెయిర్ డై కూడా కారణం కాగా కొందరిలో పోషకాల లోపం కూడా కారణం. కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలు వాడటం మరో కారణం.
సొంతవైద్యం అసలే వద్దు
జుట్టు పెరగటం కోసం ఉపయోగించే కొన్ని మందులతో సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు బుుజువైంది. యాడ్స్ చూసి ఏవేవో మందులు ట్రై చేయొద్దని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్, యూట్యూబ్‌లో చూసి బాల్డ్ హెడ్ ఉన్నవారు సొంత చికిత్స తీసుకోవటం విపరీతంగా పెరగటం..దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడేవారి సంఖ్య కూడా అమాంతం పెరిగింది. చిన్న చిట్కాల సంగతి పక్కనపెడితే.. బట్టతల కోసం స్పెషల్‌గా తీసుకునే ట్యాబ్లెట్లు లేదా ఆయిల్స్ ఏవైనా డాక్టర్ని సంప్రదించాకే వాడాలి.
కిల్లర్ ఫినాస్టరైడ్:
ప్రొపెసియా అన్న పేరుతో లభించే ఫినాస్టరైడ్ ట్యాబ్లెట్లతో బట్టతలకు వైద్యం చేస్తారు. కానీ ఈ డ్రగ్ వాడేవారిలో ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలు వస్తున్నాయట. ఈ డ్రగ్ జనరిక్ వర్షన్స్‌లో కూడా లభిస్తున్నందున బట్టతలతో బాధపడుతున్నవారు అత్యధికులు ప్రపంచవ్యాప్తంగా దీన్నే వాడుతున్నారు.
తారాస్థాయికి చేరిన మానసిక సమస్యలు:
బట్టతల కోసం చికిత్స తీసుకునేవారిలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. వీరిలో కొందరు అతి ఒత్తిడితో డిప్రెషన్ లోకి వెళ్తుంటే మరికొందరు ఆత్మహత్య ఆలోచనల్లో మునిగిపోతున్నారు. ఫినాస్టరైడ్ ఔషధాలు తయారుచేసే కంపెనీలకు కూడా ఈ విషయంపై పూర్తిగా అవగాహన ఉన్నట్టు తాజాగా తేలింది. అయినప్పటికీ ఈ మెడిసిన్ దుష్ప్రభావాన్ని వీరు హెచ్చరిక రూపంలో ముద్రించటం లేదు. ఈ విషయంపై జరిగిన మరిన్ని అధ్యయనాల్లో ఇంకా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవి ఏంటంటే.. ఈ డ్రగ్ వాడిన 45 ఏళ్ల లోపు వారు యాంగ్జైటీ, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు వంటి మానసిక రుగ్మతలతో బాధపడినట్టు అధ్యయనాల్లో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా బేస్‌లో ఈ డ్రెగ్ గురించి దిమ్మతిరిగే వాస్తవాలు ఉన్నాయి. ఈ మందు వాడే 18-45 ఏళ్ల వాళ్లలో లైంగిక వాంఛలు తగ్గటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయట. బట్టతలకు విరుగుడుగా ఫినాస్టరైడ్ మెడిసిన్ చక్కగా పనిచేస్తుంది డాక్టర్లు ఎక్కువమంది దీన్ని రిఫర్ చేస్తుంటారు. డైరెక్ట్ టు కంజ్యూమర్ కంపెనీలలో కొన్ని వీటిని విచ్చలవిడిగా సేల్ చేస్తుండటంతో చాలామంది వీటిపై కనీస అవగాహన లేకుండానే ఈ మందులను వాడేస్తున్నారు.
మరి ఏం చేయాలి?
తరచూ తలను మసాజ్ చేసుకోవటం, పెప్పర్ మింట్ ఆయిల్ ఉపయోగించండి. ముఖ్యంగా ధూమపానం మానేయటం, బయోటిన్ విటమిన్ సమృద్ధిగా తీసుకోవటం మంచిది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవటం వంటి నాచురల్ రెమిడీస్తో బట్టతలను కొంతమేర అధిగమించే అవకాశాలు ఉన్నాయట. ఇంకా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవని నిపుణులు వెల్లడించారు. జట్టుకోసం పోయి లేనిపోని సమస్యలు ఎందుకు తెచ్చుకోవటం. ముఖ్యంగా ఆ టాబ్ లెట్ వాడే వాళ్లు మీ ఆత్మీయుల్లో ఎవరైనా ఉంటే వెంటనే ఈ ఆర్టికల్ షేర్ చేయండి.