పలుచటి కనురెప్పలతో ఇబ్బందిగా ఉందా.. ఈ టిప్స్ తో ఒత్తుగా మార్చేద్దాం

-

ముఖానికి అందం కళ్లే..అందుకే కళ్లను..కలువుపూలతో పోలుస్తారు. చంద్రబింబం లాంటి ముఖానికి.. మంచి కనురెప్పలతో కళ్లు ఉంటే..ఆ అమ్మాయికి ఇక ఎలాంటి మేకప్ పెట్టక్కర్లా.. అందం అదే వచ్చేస్తుంది. కానీ కొంతమందికి..ఫేస్ అంతా బాగుంటుంది కానీ.. కళ్ల దగ్గరకు వచ్చేసరికే పాపం..అసలు కనురెప్పలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉంటాయి. మంచి షేప్ లో ఐబ్రోస్ ఉంటే లుక్ అదిరిపోతుంది కదా..కానీ కనురెప్పలు పలుచుగా ఉండే సరికి.. ఐలాషెస్ వాడుతారు. అవి వాడటం వల్ల ఎంత ప్రమాదమో మనం ఈ మధ్యనే మాట్లాడుకున్నాం.

సహజమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా కూడా కనురెప్పలను ఒత్తుగా, అందంగా, కర్వీగా కనిపించేలా చేయచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం.

ఆముదంకు కనురెప్పలను అందంగా తీర్చిదిద్దే గుణం ఉంది..శుభ్రమైన బ్రష్ లేదా దూదిని తీసుకొని దాన్ని ఆముదంలో ముంచి నిద్రపోయే ముందు కనురెప్పలకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలల పాటు పాటిస్తే చాలు…. ఒత్తయిన కనురెప్పలు మీ సొంతమవుతాయి. అయితే ముదం వల్ల కొందరిలో దద్దుర్లు, ఇతర ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిట్కాను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ఆముదం మీ బాడీకీ సెట్ అయిందంటే..జుట్టుకు కూడా రాసుకోవచ్చు.

ఇంకోటి.. గిన్నెలో గుడ్డును పగలగొట్టి వేయాలి. దీనికి టేబుల్‌స్పూన్ గ్లిజరిన్‌ను కూడా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు బీటర్ సాయంతో కలపండి. ఆ తర్వాత దూదితో ఈ మిశ్రమంలో ముంచి కనురెప్పల వెంట్రుకలకు రాసుకొని పావుగంట సమయం పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. వారంలో మూడు రోజుల పాటు ఈ చిట్కాను పాటిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

వేడి నీటిలో గ్రీన్‌టీ బ్యాగ్‌ను ఉంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత టీ బ్యాగ్‌ను బయటకు తీసేయాలి. ఈ నీటిలో దూది ఉండను ముంచి బాగా పిండాలి. దాంతో కనురెప్పల వెంట్రుకలకు మొదళ్ల నుంచి చివరి దాకా రాయాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజుకి రెండు సార్లు చొప్పున వరుసగా మూడు నెలల పాటు పాటిస్తే.. చక్కటి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ చిట్కాను పాటించే క్రమంలో గ్రీన్‌టీ కంట్లోకి వెళ్లకుండా చూసుకోండి.

కొబ్బరి పాల ద్వారా కూడా కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి. కొబ్బరిపాలల్లో..దూదిని ముంచి ఐలాషెస్‌కు రాసుకొని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను రోజూ పాటించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరిపాలు అందుబాటులో లేకుండే..కొబ్బరి నూనే రాసినా చాలు..రోజు కనురెప్పలకు కొబ్బరి నూనె రాస్తే.. చక్కటి ఫలితం కనిపిస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

పై చిట్కాలను పాటించేటప్పుడు మీరు ఉపయోగించే మిశ్రమం కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. దూదిని బాగా పిండి ఆ తర్వాత మాత్రమే రెప్పలకు రాసుకోండి.

గాలిలోని దుమ్ము, ధూళి, ఇతర మలిన పదార్థాలు ఐలాషెస్‌పై చేరి వాటి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా అవి రాలిపోయేలా చేస్తాయి. అందుకే రోజూ ఐలాష్ బ్రష్ ఉపయోగించి వాటిని ఐదు నిమిషాల పాటు శుభ్రం చేస్తుండండి.

కొంతమందికి పదేపదే కళ్లను నలుపుకొనే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే కనురెప్పల వెంట్రుకలు రాలిపోయి.. కళ్ల అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అలవాటును వీలైనంత త్వరగా మానేయండి.

రసాయనాలతో తయారైన మస్కారా, ఐలైనర్‌లను ప్రత్యేక సందర్భాల్లో మినహా రోజూ ఉపయోగింటం మంచిదికాదు. మేకప్ వేసుకుంటే..కచ్చితంగా రాత్రి పడుకునే ముందు తీసేయటం మర్చిపోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version