చర్మం హైడ్రేటెడ్ గా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చాలా శాతం మందికి డార్క్ స్పాట్స్, స్కార్స్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలతో బాధపడతారు. అలాంటప్పుడు తిరిగి యవ్వనమైన చర్మాన్ని పొందాలి అంటే చర్మం ఎంతో హైడ్రేటెడ్ గా ఉండాలి. దీనికి అవకాడో నూనె ఎంతో సహాయం చేస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు చర్మం పై అవకాడో నూనెను రాసుకోవడం వలన చర్మం ఎంతో హైడ్రేటెడ్ గా అవుతుంది. అవకాడో నూనెలో ఒలిక్ యాసిడ్, విటమిన్ ఈ వంటివి ఉంటాయి. వీటి వలన చర్మ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.
అవకాడో నూనెను తరచుగా ఉపయోగించడం వలన స్కిన్ టోన్ మెరుగుపడుతుంది మరియు స్పాట్స్, పిగ్మెంటేషన్ వంటి మొదలైన సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా డ్రై స్కిన్ తో బాధపడేవారు ప్రతిరోజు అవకాడో నూనెను రాత్రి పడుకునే ముందు చర్మం పై రాసుకుంటే ఎంతో మార్పుని పొందుతారు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అవకాడో అందానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది. దీనిని ఉపయోగించడం వలన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ డి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోతుగా పోషిస్తాయి. కనుక మంచి ఫలితాలను పొందాలి అంటే అవకాడో నూనెను తప్పకుండా ఉపయోగించండి.
అవకాడో ఆయిల్ లో ఉండే గుణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కూడా కాపాడుతాయి. దీంతో యూవీ కిరణాలు, కాలుష్యం నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి అవకాడో ఆయిల్ ఎంతో సహాయం చేస్తుంది అనే చెప్పవచ్చు. తరచుగా అవకాడో ఆయిల్ ను ఉపయోగించడం వలన చర్మం ఎంతో మృదువుగా మరియు యవ్వనంగా మారుతుంది. దీంతో చర్మం ఎంతో కాంతివంతంగా కనబడుతుంది. కనుక ప్రతిరోజు రాత్రి సమయంలో ముఖాన్ని శుభ్రపరచిన తరువాత అవకాడో నూనెతో మసాజ్ చేయాలి. ఈ విధంగా పాటించడం వలన చర్మం పై ముడతలు వంటివి రాకుండా ఉంటాయి.