చాలామంది చుండ్రు సమస్యతో బాధపడతారు. ముఖ్యంగా చలికాలంలో చుండ్రు విపరీతంగా ఎక్కువవుతుంది. అయితే చుండ్రు సమస్య నుండి చలికాలంలో బయటపడాలంటే ఏ పద్ధతులు ఉపయోగిస్తే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఇక అద్భుతమైన చిట్కాలు గురించి ఒక లుక్ వేసేద్దాం.
చుండ్రు సమస్య నుండి బయట పడాలంటే రాత్రిపూట ఒక టేబుల్ స్పూన్ మెంతులు పొడిను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని మిక్స్ చెయ్యండి. ఈ రెండు పొడులని ఒక కప్పు పెరుగులో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పూర్తిగా ఆరిపోయే వరకు వదిలేసి ఆ తర్వాత తలస్నానం చేసేయండి. ఇలా వారానికి రెండు సార్లు రిపీట్ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.
ఒక బౌల్ కొబ్బరి నూనె తీసుకుని వేడి చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి తలకు పట్టించండి. రాత్రంతా వదిలేసి ఉదయాన్నే లేచి తలస్నానం చేసినా కూడా బానే ఉంటుంది చుండ్రు సమస్య కూడా పోతుంది.
రెండు గ్లాసుల మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి రాత్రంతా వదిలేసి ఉదయాన్నే ఆ మజ్జిగని తల మీద పోసుకుని స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
లేదు అంటే వేప ఆకులను నీళ్లలో మరిగించి ఆ నీటితో కూడా స్నానం చేస్తే చుండ్రు పోతుంది.