ఫార్ములా కార్ రేసు కేసులో రేవంతే జైళ్లుకి వెళ్తాడు : జగదీష్ రెడ్డి

-

రేవంత్ ను తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం.. బండి సంజయ్ కు ఎందుకు వస్తుంది. రేవంత్ కు బండికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బండిది నిజంగా బీజేపీ రక్తమైతే రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలు పై పోరాటం చేయాలి. రేవంత్, బండి సంజయ్ మధ్యే అంతర్గత లావాదేవీలున్నాయని బీజేపీ నేతలే అంటున్నారు. రేవంత్ గొంతు వినిపిస్తున్న బండి సంజయే రేవంత్ కు నిజమైన ఏజెంట్.

రేవంత్ తో సంబంధాలు ఉన్నాయనే బండిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించారని బీజేపీ నేతలే ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో ఎందుకు స్పందించడంలేదు. అధికార కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్, కేసీఆర్ పై బీజేపీ విష ప్రచారం చేస్తోంది. కేటీఆర్ ను అరెస్ట్ చేయమని అడగటం బీజేపీ దిగజారుడుతనమే. రైతు భరోసా పై ప్రజా ఉద్యమం చేస్తామనే చెత్త కేసులు పెడుతున్నారు. చివరకు ఫార్ములా కార్ రేసు కేసులో రేవంతే జైల్ కి వెళతాడు రాసిపెట్టుకోండి అని జగదీష్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version