డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాఖ్యలు కోట్టిపడేసారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా అంటు వాఖ్యానించిన టీటీడీ చైర్మన్.. ఎవరో ఏదో చెబితే మేము ఎందుకు క్షమాపణ చెబుతాం అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అయితే తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది భక్తులు ప్రాణాలు కొంపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ తొక్కిసలాట జరిగిన ప్రణతానికి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ వచ్చారు.
అక్కడ గాయపడిన వారిని పరామర్శించిన పవన్.. అనంతరం మాట్లాడుతూ ఈ తొక్కిసలాటకు బాధ్యతగా టీటీడీ వాళ్ళు భక్తులకు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. దానికి తాజాగా ఛైర్మన్ స్పందిస్తూ.. చెప్పడంలో సమస్య లేదు.. చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా.. ఎవరో అన్నదానికి మేము రియాక్ట్ కావాల్సిన అవసర లేదు అంటూ కామెంట్స్ చేసారు. దాంతో ఇప్పుడు పవన్ కు వ్యతిరేకంగా బిఆర్ నాయుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.