జుట్టును పెంచే గింజలు.. తిన్నారంటే  హెయిర్ గ్రోత్ మాములుగా ఉండదుగా..!

-

జుట్టు సంసరక్షణకు పైన ఎన్ని మాస్కులు వేసినా.. బాడీకి కావాల్సిన పోషకాలు అందకపోతే.. సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. చుండ్రు లాంటి సమస్యలైతే.. జుట్టుకు ఏదైనా రాయడం వల్ల పోతాయ్ ఏమో కానీ… జుట్టు రాలడం, పలుచుగా అవడం, తెల్లగా మారడం లాంటి వాటికి.. లోపల నుంచే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని రకాల గింజల ద్వారా.. జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది అంటున్నారు.. సౌందర్య నిపుణులు.. మరి ఇంకెందులు ఆలస్యం అవి ఏంటో చూద్దామా..!
నువ్వులు… నలుపు, తెలుపు నువ్వుల్లో విటమిన్లు, పాలీ శాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టుకే కాదు.. ఎన్నో ఆరోగ్యసమస్యలకు నువ్వులు చక్కటి పరిష్కారం. కాల్షియం, ఐరన్ లోపాన్ని కూడా నువ్వులు భర్తీ చేస్తాయి. నువ్వులను తీసుకుంటే జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి రక్తప్రసరణ సవ్యంగా సాగేలా చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను సమన్వయం చేసి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
పొద్దుతిరుగుడు- ఈ విత్తనాలు ఫ్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాయి. వీటిలోని జింక్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌-ఇ వంటివి శిరోజాల పెరుగుదలలో ఎంతగానో తోడ్పడతాయి.
అవిసె గింజలు.- ఇక ఫ్లాక్ సీడ్స్ అయితే.. నెంబర్ వన్ సీడ్స్. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, ప్రొటీన్లు సహా మెగ్నీషియం, క్యాల్షియం వంటి పలురకాల ఖనిజాలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. ఇవి తినడం వల్ల.. పిరియడ్స్ టైంలో  పెయిన్స్ కూడా రావు.
మెంతులు- వీటిలోని ప్రొటీన్లు, నియాసిన్‌, అమైనో యాసిడ్స్‌, పొటాషియం శిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. చెంచా పెరుగులో పావుచెంచా మెంతులను నానబెట్టి రోజూ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
గుమ్మడి- డైలీ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే ఎన్నో లాభాలు  పొందవచ్చు. ముఖ్యంగా వీటిలోని జింక్‌, సెలెనియం, మెగ్నీషియం, ఐరన్‌, క్యాల్షియం, కాపర్‌, ఏ, బీ, సీ విటమిన్లు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచి చుండ్రు రానివ్వవు.
చియా- సబ్జాగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. ఇది మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో పుష్కలంగా ఉండే పీచు, ప్రొటీన్లు తదితర ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా కాపాడతాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version