దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు… 24 గంటల్లో 2451 కేసులు నమోదు

-

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు 1500 లోపే నమోదు అవుతూ  వస్తున్న కేసులు క్రమంగా పెరగుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా ‘ ఆర్ ’ వ్యాల్యూ పెరగుతోంది. ఇన్నాళ్లు 1 కన్నా తక్కువగా ఉన్నా రిపొడక్టివ్ వ్యాల్యూ.. ప్రస్తుతం ఒకటికి చేరింది. కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో ఇది 3,4గా ఉండేది. ఢిల్లీ, హర్యానా మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు… వ్యాక్సినేషన్ పెంచాలని సూచించింది. 

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2451 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే(2380) ఇది ఎక్కువ. మరణాల సంఖ్య 54గా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,241గా ఉంది. 24 గంటల్లో 1589 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మరణాలను పరిశీలిస్తే … 522116 గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 4,25,16,068 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 187,26,26,515 డోసుల వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version