జుట్టు రాలడం అనేది చాలా మందిని వేధించే సమస్య. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. జుట్టు రాలడాన్ని వదిలించుకోవడానికి సహజ మార్గాలను ప్రయత్నించడం ఉత్తమం. దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.. ఫలితం కూడా వంద శాతం ఉంటుంది. సహజ మార్గాలలో మల్బరీ ఒకటి.. వేసవిలో లభించే చాలా పోషక విలువలున్న పండు మల్బరీ.. ఈరోజు మనం మల్బరీ జుట్టు సమస్యలను ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం.
మల్బరీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. మల్బరీ పండ్లలో విటమిన్ ఇ, వివిధ కెరోటినాయిడ్ భాగాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి మల్బరీని రెండు రకాలుగా ఉపయోగించవచ్చు…
ముందుగా మల్బరీ మిక్స్‌ను పేస్ట్‌లా చేయండి. తర్వాత పెరుగు లేదా కొబ్బరి పాలు వేసి జుట్టుకు పట్టించాలి. ఈ ప్యాక్‌ని మీ జుట్టు మరియు తలపై అప్లై చేయండి. 30 నుండి 60 నిమిషాలు ఉంచండి.. ఆరిన తర్వాత కడిగేయాలి.
ఇక రెండవ పద్ధతిలో.. మల్బరీ పేస్ట్‌లో కొంచెం ఆలివ్ నూనె వేసి మీ జుట్టుకు అప్లై చేయండి. బాగా ఆరిన తర్వాత కడిగేయాలి. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది తలకు పోషణ మరియు తేమను అందించడంలో సహాయపడుతుంది.
మల్బరీ తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు…
మల్బరీ పండ్లను మితమైన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవడం కడుపుకు చాలా మంచిది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మల్బరీలో రెస్వెరాట్రాల్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది. తద్వారా గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మల్బరీలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మల్బరీని క్రమం తప్పకుండా తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.