పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఆయన నటిస్తోన్న మూవీ హరిహరవీరమల్లు. ఈ చిత్రం పీరియాడిక్ అడ్వెంచర్ యాక్షన్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవలే ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేశారు. తాజాగా సెకండ్ సింగ్ కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పుల్ సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఇటీవలే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంది. కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో కొంటె కొంటె జనుగులతో అంటూ సాగే ఈ పాట అభిమానుల మనస్సును నిజంగానే కొల్లగొట్టేలా ఉంది. లిరిక్స్ కు అనుగుణంగా పవన్ మీసాలు తిప్పుతూ ఫుల్ స్వాగ్ తో జానపద గీతానికి చేసిన డ్యాన్స్ చూసి హైప్ భారీగా పెంచేసింది. ఈ పాటలో పవన్ తో పాటు అనసూయ, పూజిత పొన్నాడ కలిసి కాలు కదిపారు. చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. మంగ్లీ ఆలపించారు. ఆమెతో పాటు రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల కూడా ఈ పాటకు గొంతు కలిపినట్టు తెలుస్తోంది.