బిజినెస్ ఐడియా: రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా అదిరే లాభాలని పొందొచ్చు..!

-

మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నార..? ఆ వ్యాపారంతో మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాను కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచి రాబడి పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు చూద్దాం.

రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ బిజినెస్ ను ఏర్పాటు చేయడానికి లక్ష రూపాయల కంటే తక్కువ అవుతుంది. పైగా ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 30 శాతం సబ్సిడీ ఇస్తుంది. లక్ష రూపాయల కనుక మీరు పెట్టుబడి పెడితే 30 శాతం సబ్సిడీ పొందొచ్చు ప్రభుత్వ సబ్సిడీ మినహాయించిన తర్వాత కిలో వాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 60 వేల నుంచి 70 వేలు పెట్టుకోవాలి.

కావాలంటే మీరు బ్యాంక్ నుండి లోన్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకులో సోలార్ సబ్సిడీ స్కీమ్, కుసుమ యోజన, నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ స్కీమ్స్ ద్వారా లోన్ ని ఇస్తారు. మీరు కనుక ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు నెలకు సంపాదించ వచ్చు.

పదేళ్లకు ఒక సారి దీని బ్యాటరీ ని మార్చాల్సి వస్తుంది. మెయింటినెన్స్ ఖర్చు అయితే పెద్దగా ఉండదు. ఒక సోలార్ ప్యానల్ జీవిత కాలం 25 ఏళ్లు. మీరు మీ ఇంటికి కావలసిన ఇంధనాన్ని వాడుకుని మిగతా దాన్ని ప్రభుత్వం లేదా ఏదైనా కంపెనీకి గ్రిడ్ ద్వారా అమ్మచ్చు. రోజుకి 10 గంటల సూర్యుని నుండి ఎండ తగులుతూ ఉంటుంది కాబట్టి 10 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా మీరు ఈ వ్యాపారం మొదలుపెట్టి అద్భుతమైన రాబడిని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version