టాలీవుడ్ విలన్, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ పై ముంబైలో కేసు నమోదు అయింది. ఆయన తెరకెక్కించిన ఓ సినిమాలో పిల్లలపై అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటం కారణంగా… దర్శకుడు మహేష్ మంజ్రేకర్ పై కేసు నమోదు అయింది. ఇటీవల మహేష్ మంజ్రేకర్…”నై వరుణ్ బట్ లోంచా కౌన్ నహి కొంచా” అనే ఓ మరాఠీ సినిమాను తీశారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎక్కువగా పిల్లల పైనే చిత్రీకరించారు దర్శకులు. ముఖ్యంగా వారి పై జరిగే ఆకృత్యాలు అలాగే వాళ్లను బానిసలుగా చూపే అంశాలపై ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమాలో సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీం దేశ్పాండే… మహేష్ మంజ్రేకర్ పై కేసు పెట్టారు.
సినిమాలో నటించిన పిల్లలంతా మైనర్లనీ… వారిపై అలాంటి దృశ్యాలు షూటింగ్ చేయడం ఫోక్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై ముంబై కోర్టులో తాజాగా మహేష్ ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారించిన కోర్టు.. ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేసింది.