బిజినెస్ ఐడియా: మీరున్న చోటే ఈ బిజినెస్ చెయ్యచ్చు.. బ్యాంకు నుండి ఐదు లక్షలు లోన్ కూడా..!

-

చాలా మంది ఎక్కువగా ఏదైనా బిజినెస్ ని చేయాలని చూస్తూ ఉంటారు మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా…? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వండి. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. బ్యాంకులు కూడా ఈ బిజినెస్ చేసేందుకు లోన్ సదుపాయాన్ని ఇస్తున్నాయి.

అయితే మీరు ఉన్న ఊరి లోనే మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. మీరు మీరు ఉన్న చోటనే కాఫీ షాప్, మెడికల్ షాప్ లేదంటే కిరాణా షాప్ ని ఓపెన్ చెయ్యొచ్చు. లోన్ సదుపాయాన్ని కూడా పొందొచ్చు.
అయితే మీరు ఏ షాప్ కి మొదలు పెట్టాలి అని నిర్ణయం తీసుకోండి దానికి అయ్యే పెట్టుబడికి తగ్గట్టుగా లోన్ తీసుకోండి. అప్పుడు ఈజీగా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సామాన్యులని ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్ని రకాల లోన్ సదుపాయాలని కూడా ఇస్తోంది.

ఏ షాప్ ని మీరు స్టార్ట్ చేయాలన్న 50,000 నుండి 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50వేల రూపాయల నుండి 10 లక్షల వరకు లోన్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలానే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కూడా లోన్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా కోటి రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ ని మీరు 3 నుండి 7 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు షాప్ ని మొదలుపెట్టేటప్పుడు మీ ఊరిలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనేది చూసి ఆ షాప్ ని మీరు స్టార్ట్ చేస్తే కచ్చితంగా లాభాలు అధికంగా వస్తాయి. అలానే మీరు ఎక్కువగా డబ్బులు దేని నుండి సంపాదించుకోవడానికి అవుతుంది అనేది కూడా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version