తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ క్వశ్చన్ పేపర్లో తప్పులు మరోసారి రిపీట్ అయ్యాయి. బుధవారం జరుగుతున్న రెండు పేపర్లలో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్లలో మిస్టేక్స్ వచ్చినట్లు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. బోటనీ పేపర్‌లో 5,7వ ప్రశ్న.. మ్యాథ్స్ 4వ ప్రశ్నలో చిన్న చిన్న తప్పులు వచ్చాయి.
అసలు విషయం గుర్తించిన ఇంటర్ బోర్డు సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తప్పు ప్రశ్నలను సరిచేసి చెప్పాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కాగా, నిన్న, మొన్న జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో కూడా తప్పులు దొర్లిన విషయం తెలిసిందే. దీంతో స్టూడెంట్స్‌తో పాటు వారి పేరెంట్స్ కూడా ఆందోళనకు గురవుతున్నారు.