బీఏసీ సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది.అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ మీట్ జరగగా ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈనెల 19న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు బీఏసీ భేటీలో తీర్మానం చేశారు.
శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో ప్రారంభమైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు. కాగా, బీఏసీ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే ఆయన వెళ్లిపోయారు.