బిజినెస్ ఐడియా: కీరదోసతో నెలకు రెండు లక్షల వరకు ఆదాయం..!

-

మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? ఆ వ్యాపారంలో మంచిగా లాభాలని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా మంచిగా లాభాలు వస్తాయి. పైగా తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…

కీర దోసని పండించి మంచిగా లాభాలను పొందవచ్చు. దీని కోసం యూపీకి చెందిన ఒక రైతు నెదర్లాండ్స్ నుండి విత్తనాలను తెప్పించి తన పొలంలో సాగు చేశాడు. ఈ రైతులాగే మీరు కూడా కీరదోస సాగు చేసి మంచి సంపాదించుకోచ్చు.

ఈ రకమైన కీరదోస మన భారతదేశంలో పండే కీరదోస కంటే రెండు రెట్లు అధికంగా ధర పలుకుతుంది. మామూలు కీర దోస కిలో 20 రూపాయలు ఉంటే.. నెదర్లాండ్స్ కీరా దోస 40 నుండి 45 రూపాయల వరకు ధర పలుకుతుంది.

రెస్టారెంట్స్ లో వీటిని సలాడ్లు వంటి వాటిని తయారు చేయడానికి వాడతారు. డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ బిజినెస్ తో మీరు మంచిగా లాభాలని పొందొచ్చు మీరు ఈ రకమైన సాగు చేయడం వల్ల ప్రతి సంవత్సరం రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version