నెలకు రూ. లక్ష సంపాదన..వ్యాపారంతో పాటు..పర్యావరణ పరిరక్షణ..!

-

వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం..లాభాలు గడించడం.. నాలుగు పైసలు వెనకేసుకోవడం. అయితే చేసే వ్యాపారంలో లాభంతో పాటు.. కూసింత సమాజిక సేవ కూడా ఉంటే.. మీరు అలాంటి వ్యాపారం చేయాలనుకుంటే ఓ సారి ఈ బిజినెస్‌ ఐడియా వైపు చూడండి.!

గాజు రీసైక్లింగ్ బిజినెస్. దీన్నే సింపుల్‌గా రీసైక్లింగ్ బిజినెస్ అంటారు. ఈ రోజుల్లో గ్లాస్ వాడకం బాగా పెరిగింది. గ్లాస్ బాటిళ్లు, గాజు పెంకులు, గాజు షో కేసులు, గాజు బల్లలు, ఇలా అన్నింట్లోనూ గ్లాస్ వాడకం బాగా ఎక్కువైంది. ఇలా వాడకం పెరిగితే.. దాని వ్యర్థాలు కూడా పెరుగుతాయి. ఇక ఏ మద్యం దుఖానానికి వెళ్లినా.. మద్యం బాటిళ్లు అన్నీ గాజువే కనిపిస్తుంటాయి. అవి పగిలిపోతే.. వ్యర్థాలను అంతా బయట పడేస్తుంటారు. ఈ వ్యర్థాలను సేకరించి.. రీసైక్లింగ్ చేసి వాటిని మళ్లీ వాడుకునేందుకు ఉపయోగపడేలా చేసేదే ఈ వ్యాపారం.

ఈ వ్యాపారాన్ని సరిగ్గా చేస్తే మంచి లాభాలు గడించవచ్చు. ముందుగా గాజును సేకరించాలి. దాని కోసం పాత సమాన్లు కొనే వారితో ఒప్పందం కుదుర్చుకొని తీసుకోవచ్చు. అంతే కాకుండా.. రీసైక్లింగ్ యూనిట్‌ను మొదలు పెట్టి.. మీ దగ్గరకు పగిలిన, పాడైన, వ్యర్థాలుగా ఉన్న గ్లాస్ బాటిళ్లు, గాజు పెంకులు వచ్చేలా చేసుకోవాలి. స్థానిక మున్సిపాలిటీ ఆఫీసుకి రోజూ చెత్త వస్తుంది. అందులో గాజు చెత్త చాలా ఉంటుంది. దాన్ని మీరు అడిగితే తక్కువ రేటుకే ఇస్తారు. దాని ద్వారా గాజును సేకరించొచ్చు. ఇలా తక్కువ ధరకు సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌కు ఎక్కువ ధరకు అమ్మవచ్చు.

ఈ గాజు వ్యర్థాలన్నీ అక్కడ పొడిలాగా మారిపోతాయి. తర్వాత నీరులా మరిగిపోతాయి. ఆ ముడి పదార్థంతో మళ్లీ కొత్త గాజు వస్తువుల్ని తయారుచేయవచ్చు. దీని వల్ల మీరు సొంత లాభాలతో పాటు.. పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్లు అవుతారు.

గాజు గ్లాసులను కరిగించే యంత్రాలు మర్కెట్లో ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా మీరే ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. రీసైక్లింగ్ అయిన గాజు ముడి పదార్థంతో… కొత్తగా గ్లాస్ కంటైనర్లు చేయొచ్చు, రోడ్లను నిర్మించవచ్చు, ఫైబర్ గ్లాస్ ఇండస్ట్రీకి అమ్మవచ్చు, రిఫ్లెక్టివ్ పెయింట్స్ వేసే పెయింట్ ఇండస్ట్రీకి అమ్మవచ్చు, ఇళ్ల నిర్మాణంలో వాడవచ్చు.మీ సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ఈ వ్యాపారంలో నలుగురు కంటే ఎక్కువ మంది పని చేస్తున్నట్లయితే .. లేబర్ సర్టిఫికెట్ పొందాలి. ఎంత ఖర్చు అవుతుంది..ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు పొందొచ్చు అనే విషయాలను మీ సేవాలో క్లుప్తంగా చెప్తారు. దీనికి ముద్ర స్కీమ్ నుంచి లోన్ సౌకర్యాన్ని పొందొచ్చు. ఇలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ సౌకర్యం ఉంటుంది. ఇలా డబ్బుతో మీరు ఏంచక్కా.. వ్యాపారం మొదలు పెట్టేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version