సీఎం రేవంత్ మెదడు నిండా విషమే.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదడు నిండా విషమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు  సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ కి పాలన చేతకాక తనపై విచారణ చేయిస్తున్నారని విమర్శించారు.

Harish Rao

మూసీ కుట్రలను బయటపెట్టారనే కారణంతోనే కేటీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారని పేర్కొన్నారు. దమ్మంటే తమతో రాజకీయంగా కొట్లాడాలని సవాల్ విసిరారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ లోనే ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. రూ.500 బోనస్ అన్నావు.. కనీసం రూ.7500 మద్దతు ధర కూడా రైతులకు రావడం లేదు.  రాష్ట్రం అంత రైతులు రోడ్డు ఎక్కుతుంటే.. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు.  వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కు లేదని పేర్కొన్నారు.  రూ.2320 మద్దతు ధర రావాల్సిన వడ్లకు రూ.1800, 1900 కు వరి పండించిన రైతులకు అన్యాయం చేస్తున్నావు

Read more RELATED
Recommended to you

Exit mobile version