మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే అమూల్ నుండి మీకు మంచి అవకాశం. దీనితో మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక దీని కోసం ఇప్పుడే పూర్తి వివరాలని చూసేయండి.
పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ మంచి అవకాశాలను ఇస్తోంది. అముల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలను స్టార్ట్ చెయ్యాలని అనుకుంది. మీరు ప్రతీనెలా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది ఇలా ఉండగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే retail@amul.coop కు మెయిల్ చేయాలి. మీరు http://amul.com/m/amul-scooping-parlours వెబ్‌సైట్ లో కూడా సమాచారాన్ని పొందవచ్చు.
ఈ రెండిట్లో మీకు నచ్చినది మీరు చెయ్యొచ్చు. మొదటి దాని కోసం మీరు రూ.2 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. అదే రెండవది కావాలంటే దానికి రూ.5 లక్షలు పెట్టుబడి అవసరం. దీనిలో కంపెనీకి భద్రతగా 25 నుంచి 50 వేల రూపాయలు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది గమనించండి.
ఇక మీకు ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే.. MRP ధర ప్రకారం పాల ప్యాకెట్లపై 2.5 శాతం, పాల ఉత్పత్తుల పై 10 శాతం. అలానే ఐస్‌క్రీమ్ పై 20 శాతం కమిషన్ ఇస్తుంది. ఇక అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజీ లో ఐస్ క్రీం, మిల్క్ షేక్స్, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, చాక్లెట్, జ్యూస్ లాంటి ఉత్పత్తులపై 50% కమీషన్ మీకు వస్తుంది.
ప్రీ – ప్యాకేజ్డ్ ఐస్ క్రీం మీద 20 శాతం, అముల్ ఉత్పత్తుల పై 10 శాతం కమీషన్ కూడా మీకు వస్తుంది. ఇక మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చెయ్యాలి అంటే దీని కోసం మీకు 150 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అముల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీ కోసం కనీసం 300 చదరపు అడుగుల ఏరియా కావాలి.