జగన్ హత్యా ప్రయత్నం చేశాడన్న వార్తలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియో రిలీజ్ చేసి…జగన్ హత్యా ప్రయత్నం చేశాడన్న వార్తలపై విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని సీరియస్ అయ్యారు వైఎస్ విజయమ్మ.
చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇటీవలి రెండు లేఖలు నేను రాసినవే.. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుకుకి లేదని తెలిపారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ వార్నింగ్ ఇచ్చింది. వైఎస్ విజయమ్మపై జగన్ హత్యా ప్రయత్నం చేశాడని టీడీపీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేసిన సంగతి తెలిసిందే.