ఇంటి దగ్గరే ఉండి చేసే ఈ వ్యాపారంతో నెలకు రూ. 45 వేల వరకూ సంపాదించుకోవచ్చు

-

ఇంటి దగ్గర ఉండే చేసే ఉద్యోగాల కోసం వెతుకోవడం షరా మామూలే.. అలాంటి జాబ్స్‌ పడితే చాలు వెంటనే అప్లై చేస్తుంటాం. మరి ఇంటి దగ్గరే ఉండి చేయగలిగే వ్యాపారాలు ఉంటే. దందా స్టాట్‌ చేయాలనే ఆలోచన ఉండి.. దాని కోసం ఎక్కడికి వెళ్లొద్దు ఇంట్లోనే ఉండాలి, పెట్టుబడి తక్కువ ఉండాలి అనే ఫీచర్స్‌ మీకూ ఉంటే ఇప్పుడు ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే..

సెల్ఫ్-లైఫ్ ఎక్కువగా ఉండే వీటిని తయారు చాలా సులభం. బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్‌లోనే బిస్కెట్లను తయారు చేయవచ్చు. బిస్కెట్ తయారీకి పదార్థాలను కలపడం, బిస్కెట్లను స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్‌లో బేక్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం వంటి నాలుగు పనులు చేస్తే సరిపోతుంది.

లో-కాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరమయ్యే ఈ హోమ్-బేస్డ్ బిజినెస్‌తో నెలకు రూ.35వేల నుంచి రూ.45వేల వరకు సంపాదించవచ్చు. వ్యాపార కార్యకలాపాలను మరింత పెంచితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు.

ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు : చిన్న తరహా బిస్కెట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, రూ.5 లక్షలు పెట్టుబడి కావాలి. రూ.90,000 పెట్టుబడి పెట్టగలిగితే, ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) నుంచి రూ.4.1 లక్షల రుణాన్ని పొందవచ్చు. PMMY లోన్ పథకం కింద, బ్యాంక్ నుంచి రూ.2.5 లక్షల టర్మ్ లోన్, రూ.1.75 లక్షల వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందుతారు. అంటే మొత్తంగా రూ.4.25 లక్షల రుణం పొందవచ్చు. ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్సర్లు, గ్రైండర్లు వంటి పరికరాలకు, పిండి, చక్కెర, వెన్న, గుడ్లు, స్పైసెస్ వంటి పదార్థాలకు ఈ డబ్బుతో కొనుగోలు చేయొచ్చు.

PMMY లోన్‌కు అర్హత పొందాలంటే, తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. సరైన వ్యాపార ప్రణాళికను కలిగి ఉండాలి. దరఖాస్తు చేస్తున్న లోన్ కేటగిరీకి తగినట్లు తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలి. బిస్కెట్ మేకింగ్ బిజినెస్ ప్రారంభించేవారికి, PMMY స్కీమ్‌ లోన్ ఉత్తమంగా నిలుస్తుంది. ఎందుకంటే రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు అందుబాటులో ఉంటాయి. రీపేమెంట్ ప్రాసెస్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ వ్యాపారానికి కనీసం 500-800 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే అద్దె డబ్బులు మిగులుతాయి కానీ హోమ్ కిచెన్‌లో ఇతర ఆహారాన్ని వండడాన్ని నిషేధించే ప్రభుత్వ నియమాలు, నిబంధనలను పాటించాలి. కమర్షియల్ కిచెన్ స్టార్ట్ చేయదలుచుకుంటే తగినంత నీరు, విద్యుత్ సరఫరా, సరైన డ్రైనేజీ వ్యవస్థ అవసరమవుతాయి. అలానే స్థానిక ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. LLP, ప్రైవేట్ లిమిటెడ్ లేదా లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ROC)తో రిజిస్టర్ చేసుకోవాలి. GSTIN, ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్, ట్రేడ్ మార్క్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) కింద రిజిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి.

ఇది చిన్న వ్యాపారం ఏం కాదు.. అనుకున్న వెంటనే చేయగలిగే వ్యాపారం అసలే కాదు. చాలా టైమ్‌ పడుతుంది. నిపుణుల సలహాలు తీసుకుని ఇంకా వివరంగా తెలుసుకుని ముందుకు వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version