బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. వచ్చే నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏకంగా నవంబర్‌లో 12 రోజులు సెలవులున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ పనుల కోసం తిరిగే వాళ్లు ఈ జాబితాను కచ్చితంగా ఫాలో కావాల్సిందే. లేకపోతే ఆఖరి నిమిషంలో తిప్పలు తప్పవు. మరి.. నవంబర్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుందామా..?
- నవంబర్ 1 – బుధవారం (కరక చతుర్థి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు ఉంటుంది.)
- నవంబర్ 5 – ఆదివారం
- నవంబర్ 10 – శుక్రవారం (వంగాల పండుగ సందర్భంగా మేఘాలయలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 11 – రెండో శనివారం
- నవంబర్ 12 – ఆదివారం (దీపావళి కూడా)
- నవంబర్ 13 – సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, దిల్లీలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 15 – బుధవారం, భాయ్ దూజ్ (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 19 – ఆదివారం
- నవంబర్ 24 – శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలోని బ్యాంకులకు సెలవు)
- నవంబర్ 25 – నాలుగో శనివారం
- నవంబర్ 26 – ఆదివారం
- నవంబర్ 27 – సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకులకు సెలవు)