దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కరోనా రాకుండా అడ్డుకునేందుకు అవసరం అయిన సామగ్రి ప్రస్తుతం మన దగ్గర చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా మాస్కులు, శానిటైజర్లు తగినన్ని లేవు. అయితే శానిటైజర్ల మాట పక్కన పెడితే.. మాస్కులను ఎవరైనా ఇండ్లలోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. మాస్కుల తయారీతో ఎవరైనా సరే.. స్వయం ఉపాధిని కూడా పొందవచ్చు. ఇక కేవలం కరోనా ఉన్న ఈ సమయంలోనే కాదు.. ఎప్పుడైనా సరే.. సర్జికల్ మాస్కులకు మంచి గిరాకీ ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడితోనే నెలకు రూ.వేలల్లో సంపాదించవచ్చు.
ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల మాస్కులను దాదాపుగా ఎవరైనా సరే.. ఇండ్లలోనే తయారు చేసి విక్రయించవచ్చు. వాటిల్లో ఒకటి సర్జికల్ తరహా మాస్క్.. రెండోది.. ఇండస్ట్రియల్ గ్రేడ్ మాస్క్.. ఇవి రెండూ మనకు ప్రొటెక్షన్‌ను ఇస్తాయి. క్లాత్, ఎలాస్టిక్, కరెంటు ఖర్చు తదితరాలను కలిపితే ఒక్కో సర్జికల్ మాస్క్ తయారీకి దాదాపుగా రూ.1.50 అవుతుంది. అదే ఇండస్ట్రియల్ గ్రేడ్ మాస్క్ అయితే.. ఒక్కోదానికి దాదాపుగా రూ.3 వరకు అవుతుంది. ఈ క్రమంలో నిత్యం ఎవరైనా.. 10 గంటల పాటు పనిచేస్తే.. 3 నిమిషాలకు ఒక్కో మాస్క్‌ను కుట్టినా.. దాదాపుగా రోజుకు 200 మాస్కులు కుట్టవచ్చు.
ఇలా రోజుకు 200 సర్జికల్ మాస్క్‌లను కుడితే.. ఖర్చు 200 * 1.50 = 300 అవుతుంది. ఇక వాటిని బయట రూ.10కి 1 చొప్పున అమ్మినా సరే.. 200 * 10 = 2000 అవుతుంది. అందులోంచి ఖర్చు రూ.300 తీసేస్తే.. 2000-300 = రూ.1700 అవుతుంది. ఇలా ఈనెలకు 30 * 1700 = రూ.51వేలు సంపాదించవచ్చు.
అదే ఇండస్ట్రియల్ గ్రేడ్ మాస్క్‌లకు అయితే.. 200 * 3 = రూ.600 రోజూ ఖర్చవుతుంది. వీటిని మార్కెట్‌లో రూ.30 వరకు విక్రయిస్తున్నారు. దీంతో 200 * 30 = రూ.6000 అవుతుంది. ఇందులోంచి ఖర్చు రూ.600 తీసేస్తే.. రూ.6000 – రూ.600 = రూ.5400 అవుతుంది. అదే నెలకు 30 * 5400 = రూ.1,62,000 అవుతుంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మాస్క్‌లను రిటెయిల్‌గా ఈ ధరకు విక్రయిస్తున్నారు. కానీ హాస్పిటళ్లు, ఇండస్ట్రీలకు ఈ మాస్కులను సరఫరా చేస్తే.. వారికి హోల్‌సేల్‌గా అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆదాయంలో సగం వరకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే.. సర్జికల్ మాస్కులకు రూ.25వేలు, ఇండస్ట్రీ గ్రేడ్ మాస్క్‌లకు రూ.81వేలు సంపాదించవచ్చు.