తాజా మా అసోసియేషన్ బాడీ ఎన్నికైన అప్పట్నుంచే విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విభేదాలు మరింత రచ్చకెక్కాయి. ఆదివారం మా అధ్యక్షుడు నరేష్ లేకుండా జీవిత, రాజశేఖర్ దంపతులు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంపై మా అధ్యక్షుడు నరేష్ సెటైర్ వేశారు. జీవిత, రాజశేఖర్ దంపతులు పేరు ప్రస్తావించకుండానే ఇది ఒక పనికిమాలిన మీటింగ్ అని నరేష్ విమర్శించారు.
మా అసోసియేషన్ మీటింగ్ లకు తాను అడ్డుపడుతున్నారని చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని… మా మీటింగ్ ఏదైనా మీటింగ్ జరిగితే… తన ద్వారా మాత్రమే జరగాలని.. కొందరు ఫ్రెండ్లీ మీటింగ్‌లు అంటూ హడావుడి చేశారని.. అందుకే తాను ఎంత మాత్రం జోక్యం చేసుకోలేదని నరేష్ చెప్పారు.
ఈఅ ఆ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఆదివారం సమావేశానికి రాకపోవటానికి మరో కారణం అని కూడా చెప్పారు. ఏదేమైనా కానీ ఈ సమావేశానికి రాకపోవడం చాలా మంచిదైందని కూడా నరేష్ తెలిపారు. ఏదో అత్యవసర సమావేశం అని హడావుడి చేశారని… రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 70 మంది సభ్యులు కూడా రాలేదని… నటుడు పృథ్వి ఈ మీటింగ్ పనికిమాలిన మీటింగ్ అన్నారని.. ఆయన చాలా బాగా మాట్లాడారు అని నరేష్ చెప్పారు.
చివరకు పరుచూరి గోపాలకృష్ణ లాంటి పెద్దలను కూడా ఎవరూ పట్టించుకోలేదని… ఆయన బాధపడుతూ వెళ్లిపోవటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇక గతంలో ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్దలు మా అసోసియేషన్ కోసం ఎంతో పని చేశారని గుర్తు చేశారు. మా ద్వారా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా… ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్దలను కలుపుకునే వెళతానని నరేష్ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఇదే మీటింగ్‌పై జీవిత, రాజశేఖర్ వాదన భిన్నంగా ఉంది. 1000 మంది సభ్యులు ఉన్న మాలో 20 మంది సభ్యులు అంటే 200 మంది మద్దతు ఉంటే మీటింగ్ పెట్టవచ్చని… మాకు ఆ మద్దతు ఉన్నందునే మీటింగ్ పెట్టామని చెప్పారు. ఏదేమైనా రోజు రోజుకు మా వివాదం ముదురుతోంది.