అమ్మాయిలూ.. మీ చర్మం మెరిసిపోవాలంటే ఇలా చేయండి..!

-

చర్మం నిగనిగ మెరిసిపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ అమ్మాయిలైతే.. ఈ సింగారం మరంత ఎక్కువ. అందుకోసం చర్మం మెరిసిపోవాలనీ, జుట్టు నిగనిగలాడిపోవాలని వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కనిపించిన ప్యాక్లు వేసుకుంటారు. క్రీములు రాసుకుంటారు.

అయితే ఇవన్నీ రసాయనాల ద్వారా తయారవుతాయి. అలా కాకుండా మనకు అందుబాటులో ఉండే సహజపదార్థాలు మన సౌందర్యాన్ని పెంచుతాయన్న సంగతి తెలుసా. అలాంటి వాటిలో కలబంద ఒకటి. దీన్ని వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అదెలాగో చూద్దాం.. కలబంద గుజ్జు, చేసి పెట్టుకోవాలి. దానికి సమాన పరిమాణంలో కొబ్బరినూనె, ఆముదం, కొన్ని మెంతులు అందులో వేసి మరిగించాలి. బాగా వేడయ్యాక తీసి చల్లార్చి ఓ డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీన్ని తలస్నానం చేసే గంట ముందు జుట్టుకి పట్టించి మర్దన చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలకు తగిన పోషణ అంది. ఆరోగ్యంగా కనిపిస్తాయి.

ఇక అలాగే.. ముఖంపై మచ్చలు తగ్గాలంటే పావు కప్పు కలబంద గుజ్జులో కొద్దిగా తేనె, చెంచా తులసిపొడి కలపాలి. దాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట ఉంచి కడిగేసి నిద్రపోవాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య దూరం అవుతుంది. ఓసారి మీరూ ప్రయత్నించి చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version