“శీతాకాలంలో, సీతాఫలం” తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా…???

-

శీతాకాలం రాగానే సీతాఫలాలు సందడి చేస్తాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ చేలగట్లపై ఉంటాయి. ఊరికి దూరంగా ఉండే చిన్నపాటి అడవుల్లో విస్తరిస్తాయి. సిటీలలో వీటి చెట్ల సంఖ్య లేకపోయినా గూబ అదిరిపోయే ఖరీదుతో అమ్మకానికి సిద్దంగా ఉంటాయి. ఎంతో ఇష్టంగా అందరూ తినే ఈ సీతాఫలంలో ఎలాంటి ఆరోగ్య కారకాలు ఉంటాయి. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

సీతాఫలం లో ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు శరీరానికి ముఖ్యంగా కావాల్సిన విటమిన్ సి కూడా వ్రుద్దిగా దొరుకుతుంది. అంతేకాదు గుండెని పదిలంగా కాపాడే పొటాషియం,మెగ్నీషియం కూడా అందిస్తుంది ఈ సీతాఫలం. అందుకు తగ్గట్టుగా తీయదనం కూడా ఉండటం వలన వీటికి ఈ కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

 

చర్మాన్ని, జుట్టు ని ఆరోగ్యంగా ఉంచగల శక్తి సీతాఫలంలో ఉంటుంది అందుకు గాను ఇందులో ఏ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. కంటి చూపు మెరుగు పరచడంలో, జీర్ణ వ్యవస్థని గాడిన పెట్టడంలో ఈ ఫలాన్ని మించింది మరొకటి లేదనే చెప్పాలి. శరీరంలో నీటి స్థాయి తగ్గకుండా జాగ్రత్త చేస్తుంది. రక్త హీనతతో ఇబ్బందులు పడే వారు సీతాఫలం ఎక్కువగా తీసుకుంటే సమస్య తొలగిపోతుంది. అంతేకాదు షుగర్ లెవిల్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సీతాఫలం.

Read more RELATED
Recommended to you

Exit mobile version