Akkineni Jayanti : దేశవ్యాప్తంగా అక్కినేని నటించిన క్లాసిక్ చిత్రాలు 10 ప్రదర్శన

-

టాలీవుడ్ దివంగత సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నటించిన చిత్రాలు అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఏఎన్నార్ అభిమానులు ఇప్పుడు నాగార్జున అభిమానులుగా మారిపోయారు. నాగేశ్వర్ రావు నటవారసులుగా వచ్చిన నాగార్జున కాస్త పేరు సంపాదించుకున్నప్పటికీ ఆయన కుమారులు మాత్రం అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయారు. ఏఎన్నార్ వల్లనే వారు ప్రస్తుతం సినీ రంగంలో రాణిస్తున్నారు.

నేడు లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. అయితే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 31 సిటీస్ లో అక్కినేని నటించిన క్లాసిక్ చిత్రాలు 10 ప్రదర్శిస్తున్నారు.  ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ANR క్లాసికల్ హిట్ సినిమాల ప్రదర్శిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్, హెరిటేజ్ ఫౌండేషన్ మరియు పీవీఆర్ ఐనాక్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ  ఆర్కే సినిప్లాక్స్ లో అక్కినేని దేవదాసు సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనకు  అక్కినేని నాగార్జున నాగ చైతన్య టు పాటు కుటుంబసభ్యులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version