2022 ఏడాది కొన్ని సినిమాలకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలైతే ఊహించని ప్రాఫిట్స్ కూడా అందుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే స్టార్ హీరోల మార్కెట్ తో పాటు స్టార్ హీరోయిన్ల మార్కెట్ కూడా పెరిగిపోయింది . కొంతమంది హీరోయిన్లు ఇప్పటికీ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది టాలీవుడ్ లో నలుగురు హీరోయిన్ల పేర్లు ఎక్కువగా చర్చల్లోకి వచ్చాయి.
పూజా హెగ్డే కూడా వరుసగా డిజాస్టర్ ను చవిచూసినా సరే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐరన్ లెగ్ అనే కామెంట్స్ కూడా అందుకుంది.కానీ పెద్ద సినిమాల ఆఫర్లతో ఆర్థికంగా ఆమె మాత్రం మంచి ఆదాయాన్ని అందుకుందని చెప్పవచ్చు.
ఆ తర్వాత యంగ్ బ్యూటీ శ్రీ లీల ఎక్కువగా తన అందంతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. పెళ్లి సందD సినిమా తర్వాత ధమాకా సినిమాతో కూడా మంచి క్రేజ్ అందుకుంది. మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు అందం, నటన ఈమెకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
మరో యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కూడా బాగానే వైరల్ అయింది. సీతారామం సినిమాతో కెరీర్ కు సరిపడే అంత క్రేజ్ అందుకుందని చెప్పవచ్చు. అందులో ఆమె ట్రెడిషనల్ లుక్ తోనే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇప్పటికి సీత అంటూ ఆమె పేరును ఎక్కువగా ఉచ్చారణ చేస్తున్నారు యువత. చాలామంది అబ్బాయిలు ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఉంటే బాగుంటుంది అనే క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో మృణాల్ ఠాగూర్ ఈ ఏడాది 2022 హీరోయిన్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచింది అని చెప్పవచ్చు.