ప్రదీప్ షో ఆపేస్తున్నారు.. ఎంత నష్టమో తెలుసా..!

-

స్టార్ మా బిగ్ బాస్ ముగించగానే యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు షో మొదలు పెట్టారు. బిగ్ బాస్ టైంలోనే ఓ రోజు హౌజ్ లోకి వెళ్లి తర్వాత షో ఇదే అని ఆడియెన్స్ కు హింట్ ఇచ్చాడు. బిగ్ బాస్ పూర్తవడం ఆ మరుసటి వారం నుండి పెళ్లిచూపులు మొదలవడం జరిగింది. ప్రదీప్ పెళ్లిచూపులు దీనిలో రకరకాల టాస్కులు.. చెప్పడానికి రియల్ పెళ్లిచూపులని చెప్పినా ఇది కూడా గేం షోలా మారింది.

అతని పెళ్లిచూపులైతే మేమెందుకు చూడాలి అంటూ బుల్లితెర ప్రేక్షకులు మండిపడుతున్నారు. కొందరైతే అసలు ఈ షో ఏంటని తెలుసుకునేందుకు చూసి ఎపిసోడ్ ఎపిసోడ్ కు వారు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు. ఇక షో మీగ నెగటివ్ కామెంట్స్ అయితే కోకొల్లలు. ప్రదీప్, సుమలు తెలిసిన వారికి కూడా వాళ్లను ఈ షో ఆపమనండి బాబోయ్ అంటూ మెసేజులు పెడుతున్నారట.

షోకి ప్రేక్షకాదరణ కరువైంది. అందుకే ఇక షోని మరో వారంలో ముగిద్దామని అనుకుంటున్నారట. ఈ షో కోసం దాదాపు 60 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. సెట్ ప్రాపర్టీస్ తో పాటుగా స్టార్ మాలో ఇన్ని ఎపిసోడ్స్ అంటూ స్లాట్ కూడా బుక్ చేసుకున్నారట. మొత్తానికి ప్రదీప్ పెళ్లిచూపులు అట్టర్ ఫ్లాప్ షో అయ్యింది. నష్టం కూడా భారీగానే వచ్చిందట. మరి ఈ నష్టం అంతా ఎవరు భరిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version