చిరంజీవి తొక్కేయడంపై హీరో సుమన్ క్లారిటీ !

-

చిరంజీవి నన్ను ఎదగకుండా తొక్కేశాడు అనడంలో అర్థం లేదని క్లారిటీ ఇచ్చారు హీరో సుమన్. తాజాగా ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నన్ను ఎదగకుండా తొక్కేశాడు అనడంలో అర్థం లేదని… హీరో సుమన్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యాన్స్ అనవసరంగా మా కోసం కొట్టుకుంటున్నారని తెలిపారు.

hero suman comments on chiranjeevi

మేమందరం చాలా క్లోజ్.. మేం బాగానే ఉంటామని వెల్లడించారు. యూట్యూబ్‌లో చూసిందే నిజమని నమ్మి ఏదేదో చేయొద్దని అభిమానులను కోరుతున్నానన్నారు హీరో సుమన్. హిందువుల రక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేయాలన్నారు. తాను సెకులరిస్టునని అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. అందుకోసమే ప్రతీ రిలీజియన్‌ రక్షణ కోసం పార్లమెంటులో ప్రత్యేక బిల్ తీసుకుని రావాలన్నారు. తాను ఒక్క హిందువులకే సపోర్టు చేయడంలేదని, అందరూ నన్ను ఆదరిస్తేనే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version