అసెంబ్లీకి రాకుండా పేపర్ ద్వారా ప్రశ్నలు.. ఏపీ స్పీకర్ ఏం చేశారంటే?

-

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అసెంబ్లీని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాయిదా వేశారు. బుధవారం ఉదయం తిరిగి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాలేదు. కానీ, పేపర్ల రూపంలో ప్రశ్నోత్తరాలను స్పీకర్‌కు పంపించారు.

వైసీపీ సభ్యుల ప్రశ్నలకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ.. ఏం మాట్లాడకుండా ఖాళీ కుర్చీలను చూపించారు.వైసీపీ సభ్యులు ప్రశ్న అడిగారు కానీ, సభకు రాలేదని గుర్తుచేశారు. అందుకే వాళ్లు అడిగిన ప్రశ్నలను వాయిదా వేస్తున్నానని స్పీకర్ తెలిపారు.సభ్యులు సభకు హాజరైతేనే సమాధానం దొరుకుతుందని పరోక్షంగా వారికి సమాధానాన్ని తెలియజేశారు. దీంతో స్పీకర్ చేసిన పని సమంజసమే అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version