91వ ఆస్కార్ అవార్డులు విజేతలు వీరే..!

-

ప్రతి ఏటా జరిగే అకాడమీ అవార్డుల గురించి అందరు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఈ ఇయర్ కూడా 91వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సినిమాలు ఈ అవార్డుల్లో పోటీ పడతాయి. ఈ ఇయర్ అకాడమీ అవార్డుల్లో 24 విభాగాల్లో 52 సినిమాలు బరిలో నిలిచాయి. మన దేశం నుండి 28 సినిమాలు నామినేషన్ కు వెళ్లాయి.

మన దేశానికి చెందిన ఒక డాక్యుమెంటరీ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అఏ డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చింది. ఆడపిల్లలు ఎదుర్కుంటున్న పీరియడ్ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 25 నిమిషాలు కలిగిన ఈ డాక్యుమెంటరీ ఇండియాకు ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టింది.

అసోం కు చెందిన విలేజ్ రాక్ స్టార్స్ అకడెమీ పరిశీలణకు వెళ్లినా నామినేట్ అవలేదు. ఇక ఈ ఇయర్ ఆస్కార్ అవార్డులు అందుకున్న వారి వివరాలు

ఉత్తమ సహాయ నటుడు: మహేర్షలా అలీ
ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: రోమా
బెస్ట్ సినిమాటోగ్రఫీ: అల్ఫోన్సో కౌరోన్(రోమా)
బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిలిం: స్పైడర్ మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వెర్స్
బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం: బవో
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: బెహిమైన్ రాప్సోడీ
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : రూత్ కార్టర్
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: బెహిమైన్ రాప్సోడీ

Read more RELATED
Recommended to you

Exit mobile version