కన్నడ నటి, గోల్డ్ స్మగ్లర్ రన్యారావు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యారావుకు 12ఎకరాల భూమి కేటాయించింది కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్. 2023లో క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూమి కేటాయింపులు చేసింది.
క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా రన్యారావు పని చేశారు. కర్ణాటకలోకి అగ్ర రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక ఈ సంఘటన పై ఇంకా కూపీలు లాగుతున్నారు పోలీసులు.
ఇక అటు కన్నడ నటి రన్యారావు శరీరంపై గాయాలు ఉన్న ఫొటో చక్కర్లు కొడుతోంది. దీంతో… ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు. సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కర్ణాటక మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి. బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు కన్నడ నటి రన్యారావు. ఈ తరుణంలోనే…. కన్నడ నటి రన్యారావు దగ్గర భారీగా బంగారం స్వాధీనం చేసుకుంది డీఆర్ఐ. ఈ సంఘటన లోతుగా విచారిస్తున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.