సింగర్ కల్పన విషయంలో వివరణ ఇచ్చిన పోలీసులు..!

-

సింగర్ కల్పన విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఆమె కుటుంబంతో సహా ఎర్నాకుళంలో నివాసం ఉంటున్నారు. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి నిజాంపేట్ లోని విల్లాలో ఉంటున్నారు.. కల్పనా కూతురు దయా ప్రసాద్ చదువు విషయంలో ఆమెకు ఆమె కూతురు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నిన్న ఎర్నాకుళం నుండి హైదరాబాద్ కి ఉదయం 11:45 నిమిషాలకు చేరుకున్న కల్పన.. ఒంటిగంట 40 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదని స్టేట్మెంట్లో చెప్పింది కల్పన.

అయితే కల్పనకు ఆమె భర్త ప్రసాద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కాలనీ వెల్ఫేర్ మెంబర్స్ కి ఫోన్ చేసి చెప్పిన ప్రసాద్.. డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి చెప్పడంతో కల్పన ఇంటికి వెళ్లారు పోలీసులు. కల్పన మెయిన్ డోర్ ఎన్నిసార్లు కొట్టిన తీయకపోవడంతో కిచెన్ నుండి లోపలికి ప్రవేశించారు పోలీస్ సిబ్బంది. అక్కడ బెడ్రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను దగ్గర్లోని ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొచ్చారు పోలీసులు. అయితే నిద్రపట్టకపోవడంతో అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని పోలీసులు స్టేట్మెంట్లో చెప్పింది కల్పన.

Read more RELATED
Recommended to you

Exit mobile version