A fan died while watching the movie Pushpa-2: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే… ఇలాంటి నేపథ్యంలో ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. పుష్ప 2 సినిమా చూస్తూ అభిమాని మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయదుర్గం లో ఉన్న ఓ థియేటర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ థియేటర్లో పుష్ప టు సినిమా చూస్తూ మద్దానప్ప అనే 37 సంవత్సరాల అల్లు అర్జున్ అభిమాని మృతి చెందడం జరిగింది. సినిమా షో ముగిసిన తర్వాత కూడా అతను సీటులోనే కూర్చుని ఉండడంతో ప్రేక్షకులకు అనుమానం…రావడం జరిగింది.
దీంతో థియేటర్ యజమాన్యానికి ఈ విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత ఆ యువకుడు మరణించినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు విచారణ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు పోలీసులు.