ఈ మధ్య తిరుమలలో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల తొలుత లడ్డు వివాదం చోటు చేసుకుంది. లడ్డు వివాదం చోటు చేసుకోగానే.. ఆహారం నాణ్యత లేదని మరో ఘటన. మళ్లీ తొక్కిసలాట, అగ్ని ప్రమాదం ఇలా ఏదో వివాదస్పద ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది.
అయితే ముఖ్యంగా భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ మరో ముండగుడు వేసింది. అన్న ప్రసాదంలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. అన్నప్రసాదం మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ అధికారులు.. భోజన సమయంలో మసాలా వడ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ప్రయోగాత్మకంగా ఇవాళ మధ్యాహ్నం అన్నప్రసాదం కేంద్రంలో వడలు వితరణ చేసింది టీటీడీ.