పుకార్లను నిజం చేసిన హీరో ఆది.. ల‌వ‌ర్‌తో ఎంగేజ్‌మెంట్ : ఫోటోలు వైర‌ల్

-

గ‌త కొద్ది రోజుల నుంచి హీరో ఆది పినిశెట్టి, క‌న్నడ హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ ప్రేమ‌లో ఉన్న‌ట్టు పుకార్లు వ‌చ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆది – నిక్కి గ‌ల్రానీ ల‌వ్ గురించి పెద్ద చ‌ర్చ‌నే జ‌రిగింది. అలాగే ఆది పినిశెట్టి – నిక్కి గ‌ల్రానీ పెళ్లీ పీఠ‌లు కూడా ఎక్క‌డానికి కూడా సిద్ధం అయ్యార‌నే వార్తలు కూడా వ‌చ్చాయి.

అయితే వీటిపై హీరో ఆది పినిశెట్టి గానీ, నిక్కి గ‌ల్రానీ గానీ అధికారికంగ స్పందించ‌లేదు. అయితే తాజా గా రెండు రోజుల నుంచి మరో వార్త సోషల్ మీడియాలో చక్క‌ర్లు కొట్టింది. ఆది పినిశెట్టి – నిక్కి గ‌ల్రానీ మార్చి 24 న ర‌హ‌స్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నార‌ని సోషల్ మీడియా కోడై కూసింది.

అయితే ఈ వార్త‌ల‌ను, గ‌తంలో వ‌స్తున్న పుకార్ల‌ను ఆది పినిశెట్టి నిజం చేస్తూ.. త‌న ఎంగేజ్ మెంట్ ఫోటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నాడు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్న‌ట్టు కూడా తెలిపాడు.

అలాగే తాము ఈ నెల 24 న ఎంగేజ్ మెంట్ చేసుకున్నామ‌ని ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించాడు. త‌మ కొత్త జ‌ర్నీకి అంద‌రి బ్లెసింగ్స్ కావాల‌ని ట్వీట్ చేశాడు.

కాగ ఆది పినిశెట్టి – నిక్కి గ‌ల్రానీ ఎంగేజ్ మెంట్ ఫోటోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version