సుకుమార్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు..!

-

టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్నారు ఇన్కమ్ టాక్స్ అధికారులు. అయితే తాజాగా పుష్ప సినిమా దర్శకుడు దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిసాయి. రెండు రోజులపాటు సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి నేటి ఉదయం వరకు సోదాలు చేసారు ఐటీ అధికారులు.

అయితే సుకుమార్ ని నిన్న ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి తీసుకువచ్చి సోదాలు చేసారు ఐటీ అధికారులు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా లో సుకుమార్ కు షేర్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని,మాంగో అధినేత రామ్ ఇళ్ళలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఫైనాన్సర్స్ లకు చెందిన ఇళ్ళు, ఆఫీసులలో సోదాలు చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని దాదాపు 15 మంది ఇండ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను పరిశీలిస్తున్నారు ఇన్కమ్ టాక్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version