AamirKhan: భార్యకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్

-

బాలీవుడ్ పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు అనేది బాలీవుడ్ పరిశ్రమలో చాలా సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్ తన భార్య నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. అయితే తాజాగా ఈ లిస్టులో మరో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా చేరిపోయాడు. అవును.. తాజాగా అమీర్ ఖాన్  సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు అమీర్ ఖాన్ దంపతులు కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత డైవర్స్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఇక ముందు తమ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ పోతున్నట్లు… పేర్కొన్నారు. ఇకపై తాము భార్యాభర్తలుగా కాకుండా సహా తల్లిదండ్రులుగా మరియు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మా కుమారుడు ఆజాద్ పెంపకంలో ఇద్దరం కలిసి ఉంటామని అలాగే మేం చేస్తున్న, చేయబోయే సినిమాలు… పానీ పౌండేషన్ వ్యవహారాల్లోనూ కలిసే ముందుకు వెళ్తామని వెల్లడించారు. మమ్మల్ని అర్థం చేసుకొని మాకు నిరంతర మద్దతు తెలియజేసిన మా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని… మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తారనే భావిస్తున్నట్లు అమీర్ ఖాన్ దంపతులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version