రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక భారీ కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతాం. కుట్ర దారులు వెనక అధికారులు ఉంటే ఉద్యోగాలు తీసేస్తం.రాజకీయ పార్టీ కుట్ర ఉందని మా అనుమానం.
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్‌లో పరిశ్రమకు అనుమతి ఇచ్చిందే బీఆర్ఎస్.దానికి 2023లోనే అనుమతి ఇచ్చారు.
ఇథనాల్ కంపనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్, బీజేపీ. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా అనుమతి ఇచ్చింది కేటీఆర్.నిస్సిగ్గుగా మాపై నిందలు వేస్తున్నారు.కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి కిరణ్ వ్యవహరించారు.ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు కేటీఆర్..దిలావర్ పూర్ పోదాం రండి.చిల్లర రాజకీయాలు ఆవసరమా? కేటీఆర్. ఇకనైనా డ్రామాలు ఆడటం మానుకోండి.తలసాని వియ్యకుండు ఇథనాల్ ఫ్యాక్టరీలో మరో భాగస్వామిగా ఉన్నాడు. మీ తప్పులు కప్పిపుచ్చుకుని మాపై నిందలు వేస్తున్నారు. కేటీఆర్..నీకు చిత్తశుద్ధి అంటే దిలావర్ పూర్‌కిరా..? కడప వాళ్లకు కంపనీకి ఇచ్చింది నువ్వు. అన్నీ వివరాలు త్వరలో బయటపెడతాం’ అని స్పష్టంచేశారు.