ఓటీటీలోకి సుస్మితా సేన్ ‘ఆర్య అంతిమ్‌ వార్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

-

మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్‌ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తోంది. అయితే వెండితెరపై కాకుండా ఈ బ్యూటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ఆర్య, ఆర్య-2, ఆర్య-3, తాళి వంటి వెబ్ సిరీస్ లతో అదరగొట్టింది. ఇక ఇప్పుడు ఆర్య ఫ్రాంచైజీలో మరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఆర్య’ డిస్నీ + హాట్‌స్టార్‌ స్పెషల్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్‌ ఆఖరి సీజన్‌ ‘ఆర్య అంతిమ్‌ వార్‌’ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సిరీస్‌కు తన మనసులో ప్రత్యేకస్థానం ఉంటుందని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో సుస్మితా సేన్‌ చెప్పుకొచ్చింది. తన హృదయానికి చేరువైన కథ ఇది అని ఇందులో యాక్ట్‌ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ డ్రామాకు రామ్‌, సందీప్‌, వినోద్‌ రావత్‌, కపిల్‌ శర్మ ఆయా సీజన్లకు దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news