హీరో నాగార్జునపై చర్యలు తీసుకోవాలని HRCకి ఫిర్యాదు

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జునపై చర్యలు తీసుకోవాలని HRCకి ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ షో నిర్వాహకుడు, హీరో నాగార్జునపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ (HRC)కి ఫిర్యాదు చేశారు ప్రముఖ లాయర్ అరుణ్‌ కుమార్.

Action taken against hero Nagarjuna Complaint to HRC

ఫైనల్స్ ముగిసిన తర్వాత జరిగిన దాడులు, ఇతర ఘటనలను ఆయన HRC దృష్టికి తీసుకెళ్లారు. అటు బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కాగా, బిగ్ బాస్ – 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన హరినాథ్ రెడ్డి(20) అనే విద్యార్థితో పాటు యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ కు చెందిన సుధాకర్(23) గోడవల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి, రిమాండ్ కు పంపారు. వీరితో పాటు పవన్(22) అనే యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version