ఐసీయూలో నటుడు అబ్బాస్.. కంగారులో ఆయన అభిమానులు..

-

టాలీవుడ్ నటుడు అబ్బాస్ ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఆయనకు ఏమైందో అంటూ తెగ ఆందోళన పడిపోతున్నారు ఆయన అభిమానులు..

90లో యువతను ఒక ఊపు ఊపేసిన నటుడు అబ్బాస్ తన అందంతో అమ్మాయిల గుండెల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.. కొన్నాళ్లపాటు తెలుగు తమిళ మలయాళ చిత్రాల్లో నటించిన అబ్బాస్ తర్వాత వెండితెరకు దూరమయ్యారు అయితే తాజాగా ఆయన ఆసుపత్రి బెడ్ పైన ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. చేతికి సెలైన్స్, ఆక్సిజన్ ట్యూబ్స్ తో ఐసీయూలో ఉన్న అబ్బాస్ ని చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఆయన ఒక సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం… కంగారు పడాల్సిన విషయం ఏమి లేదని తెలుస్తోంది.. కొద్దిరోజుల క్రితం ఆయనకు యాక్సిడెంట్ అయినట్టు దాంతో మోకాలికి గాయమైనట్టు సమాచారం. దీంతో వైద్యులు ఆయనకి తప్పనిసరిగా సర్జరీ చేయాలని సూచించారంట..

వినీత్ టాబు అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమదేశం చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు ఈ నటుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో ఆయన కెరియర్లో వరుస అవకాశాలు అందుపుచ్చుకున్నాడు. ఒక దశలో లవర్ బాయ్ ఇమేజ్ అబ్బాస్ ఎంజాయ్ చేశాడు.. అయితే అంత అందమైన నటుడు కూడా సినిమాలో ఎంపికలో చేసిన చిన్న చిన్న తప్పిదాలు ఆయన కెరీర్ను ఫీడ్ అవుట్ చేశాయి ఎక్కువగా సెకండ్ హీరో ఛాన్సులకు ఓటేయడంతో ఆయనను అభిమానులు అలాగే చూసేందుకు ఫిక్స్ అయిపోయారు.. రాజా, నరసింహ, ప్రియురాలు పిలిచింది, చెలి, నీ ప్రేమకై, శ్వేత నాగు.. చిత్రాలు మంచి పేరుని తీసుకొచ్చాయి… 2015 తర్వాత ఆయన సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. అబ్బాస్ భార్య ఇరుమ్ అలీ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. అయితే తన ఫ్యామిలీతో పాటు ఈయన విదేశాల్లో సెటిల్ అయినట్టు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version