కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యాడు. అజిత్ ప్రస్తుతం కారు రేసింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రేసింగ్ లో పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. తాజాగా మరోసారి అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. రేసింగులో పాల్గొన్న అజిత్ కారు ఒక్కసారిగా ట్రాక్ నుంచి పక్కకు వెళ్లి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అయితే అజిత్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
ఇదే ఏడాదిలో ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం నుంచి హీరో క్షేమంగా బయటపడ్డాడు. అయితే ఈ కారు ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అజిత్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కొందరు అంటున్నారు. మరి ఆయన అభిమానులేమో.. తమ అభిమాన హీరో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.
మరోసారి కారు ప్రమాదానికి గురైన తమిళ హీరో అజిత్
బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో కారు ప్రమాదం
రేస్‌లో అదుపుతప్పి ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీకొట్టిన కారు
ప్రమాదం నుండు సురక్షితంగా బయటపడ్డ అజిత్ https://t.co/tBTJxWXKUE pic.twitter.com/mZBl6ziUbs
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025