ఎన్టీఆర్ చెప్పినా నటుడు కాంతారావు ఆ మాట వినలేదట.. చివరకి..

-

అప్పట్లోనే తెలంగాణ నుంచి వెండితెరకి పరిచయమైన కాంతారావు, కథానాయకుడిగా ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత స్థానంలో నిలిచారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ల మాదిరిగానే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని, వరుస సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు ఆడకపోవడం వలన ఆయన ఆర్ధికంగా దెబ్బతిన్నారు.

 

ఈ విషయాలను గురించి ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కాంతారావు కూతురు సుశీలా రావు మాట్లాడుతూ.. “మా నాన్నగారి చిన్నతనంలోనే మా తాతగారు చనిపోయారు. అందువలన మా నాన్నగారిని వాళ్ల అమ్మగారు చాలా గారంగా పెంచారు. ఏ విషయంలోనైనా ఆయన మాట నెగ్గవలసిందే. అందువలన ఆయన ఎవరి మాటా వినేవారు కాదు .. తనకి తోచిందే చేసేవారు. వద్దని చెబితే దానినే తప్పకుండా చేసేవారు” అన్నారు.

“సినిమాల నిర్మాణం జోలికి పోవద్దని ఎన్టీఆర్ గారు చెప్పిన మాట నిజమే. కానీ నష్టపోయిన తరువాత మాత్రమే ఆయన మాట వింటే బాగుండేదని అనుకునేవారు. నా పెళ్లికి కృష్ణగారు మాత్రం సహాయం చేశారు. అలాగే తాము ఏ సినిమా తీసినా అందులో నాన్నగారికి వేషం ఇస్తానని చెప్పారు .. ఇస్తూ వెళ్లారు కూడా. అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ గారు మా నాన్నగారికి చాలాసార్లు చెప్పిన ఆయన ఎప్పుడూ వినలేదు డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండాలని తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలుమార్లు ఆయన హితబోధ చేసేవారు.. ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాక నాన్నగారికి అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండేదని అందుకే ఆస్తి మొత్తం పోయిందని అందరూ అన్నారు కానీ ఆ మాట అసలు నిజం కాదు.. నాన్నగారికి సినిమా తప్ప మరేమీ తెలియదు. అందువలన చివరివరకూ నటిస్తూ వెళ్లారు. ఆయన మా కోసం ఏమీ మిగల్చలేదనే బాధ మాకు ఎప్పుడూ లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version