టాలీవుడ్ స్టార్ నటుడు మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. లైసెన్సుడ్ గన్‌ను డిపాజిట్ చేశారు మోహన్ బాబు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో తన లైసెన్సుడ్ గన్‌ను డిపాజిట్ చేశారు నటుడు మోహన్ బాబు.. రెండు రోజుల క్రితం పిఆర్వో ద్వారా మోహన్ బాబు తన డబుల్ బ్యారెల్ గన్‌ను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

ఇక అటు మంచు మోహన్‌బాబు PRO సహా బౌన్సర్లు ఆరుగురికి 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 9న మోహన్‌బాబు యూనివర్సిటీలో కవరేజ్‌కు వెళ్లిన మీడియాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన రిపోర్టర్లు ఫిర్యాదు తో కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో…మంచు మోహన్‌బాబు PRO సహా బౌన్సర్లు ఆరుగురికి 41ఏ నోటీసులు జారీ అయ్యాయి.